Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ప్రజలకు,ప్రభుత్వాలకు జర్నలిస్టులు వారధులుగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తున్నారని ఎంపీపీి తాండ్ర అమరావతి శోభన్ అన్నారు.జర్నలిస్టు డే సందర్భంగా టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో వైసరెంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్,మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గడ్డమీది పాండరి,మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్,సర్పంచ్ లు దార సైదులు,యాస భాషి రెడ్డి,అంబాల ఎంపీటీసీ పొన్నగాని మహేష్,వెల్మజాల ఉపసర్పంచ్ సింగారం పాండు,మండల సీనియర్ నాయకులు కోలుకొండ రాములు,చిందం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : పట్టణకేంద్రంలో సోమవారం లైఫ్ ఇన్ఏడే ,అస్తిత్వ 2021 అవార్డు గ్రహీత ముల్లక్కల రవికుమార్‌ను జిల్లా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ డాక్టర్నగేశ్ ,కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య , సీఐ గోపిశెట్టి నర్సయ్య , మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య సన్మానించారు. జర్నలిస్టు జాన్సన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సై ఇంద్రేశ్ అలీ ,శ్రీ రామకష్ణ విద్యాలయం కరస్పాండెంట్ బండి రాజుల శంకర్, నాయకులు పసునూరి వీరేశం, ఎంఏ ఎజాజ్ , మ్మోహనరావు పాల్గొన్నారు .