Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని సోమవారం 1, 2,3, 18,19,39, 41 వార్డు అధ్యక్షుల, అనుబంధ సంఘాల ఎన్నికలు, వార్డుల ఎన్నికల ఇన్చార్జి ఎంజి యూనివర్సిటీ సెనేట్ సభ్యులు బోయపల్లి కష్ణారెడ్డి, టీిఆర్‌ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు అనీష్ మక్తదర్లు ఎన్నికల అధికారుల సమక్షంలో నిర్వహించారు. 1, వ వార్డు అధ్యక్షునిగా రూపని యాదగిరి, 2,వ వార్డు అధ్యక్షునిగా తగుళ్ళ ప్రదీప్ కుమార్, 3,వ వార్డు అధ్యక్షునిగా పెరుమాళ్ళ జనార్ధన్, 18, వ వార్డ్ అధ్యక్షునిగా సంధినేని జనార్దన్ రావు, 19 వ వార్డు అధ్యక్షునిగా ఒగ్గు పులేందర్, 39 వ వార్డు అధ్యక్షులుగా మామిడి పద్మ, 41 వ అధ్యక్షునిగా యాట జయప్రద రెడ్డి, వీరితో పాటు కార్యవర్గాన్ని వివిధ అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న టు ఎన్నికల అధికారులు ప్రకటించారు . ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మెన్ అబ్బ గోని రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు పిల్లి రామ రాజు యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, కంచనపల్లి రవీందర్రావు, సింగిల్‌విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు,ఆలకుంట మోహన్ బాబు పేర్ల జానయ్య, భాష పాక హరికష్ణ, సూర మహేష్,పెరిక యాదయ్య తక్కిళ్ళ అశోక్,నాంపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కేతెపల్లి : టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మండల లోని కొత్తపేట గ్రామశాఖ అధ్యక్షునిగా రాచకొండ సైదులును ఆ పార్టీ నాయకులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి ,స్థానిక సర్పంచ్ బచ్చుజానకీరాములు ఎంపీటీసీి బుర్రి యాదవరెడ్డి , ఉప సర్పంచ్ తండు రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి సునిత అంజయ్య కార్మిక శాఖ అధక్షుడు దాసరి సుధాకర్ యూత్ అధ్యక్షుడు ధన్‌రాజ్ ,నాయకులు లింగమూర్తి,ఇదిగని కుమార్,ఊర యాదగిరి ,నారగోని శ్రీను, యూసుఫ్‌అలీ,మునగ రవీందర్, రాచకొండ నాగమణిబజార్,ఊర సత్యనారయణ,జూలూరి యాదగిరి,బత్తుల శ్రీను,కటిక మహేష్,మునగ లింగయ్య, గంగయ్య పట్టేటి జానకిరాములు ,జోజి , ముతయ్యా, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆలేరు ఎన్నికల ఇన్చార్జి ఇమిడి రామురెడ్డి ,మాజీ వైస్ ఎంపీపీ కోరుకోపులా కిష్టయ్య ఆధ్వర్యంలో కొల్లూరు టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా జనగాం వెంకట పాపి రెడ్డి ఎన్నికయ్యారు .ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ నరసయ్య, ఆంజనేయులు, శ్రీధర్, అనిల్ ,పాండరి ,సురేష్, యాదగిరి ,రాములు, చంద్రయ్య ,రాజు, మల్లికార్జున్ ,గోపి పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించారు.మరిపడిగ గ్రామశాఖ అధ్యక్షుడిగా అనంతుల శేఖర్,మాసాన్‌పల్లి అధ్యక్షుడిగా ఎలిపెద్ది వెంకట్ రెడ్డి,బ్రాహ్మణపల్లి అధ్యక్షుడిగా మేడ రాంచంద్రు,బుర్జుబావి అధ్యక్షుడిగా భాస్కర్ లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్,మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీలు గడ్డమీది పాండరి, మందడి రామకష్ణారెడ్డి, సంగి వేణుగోపాల్, రావుల హరితాదేవి పాల్గొన్నారు.
బొమ్మలరమారం : మండలంలో గోవిందు తండా గ్రామంలో సోమవారం టీఆర్ఎస్గ్రామ శాఖ అధ్యక్షులుగా ధీరావత్ బికు నాయక్, ఉపాధ్యక్షులుగా దిరావత్ రమేష్ నాయక్ ,ప్రధాన కార్యదర్శిగా గుగొలోత్ లింగా నాయక్ , కార్యదర్శిగా ఇద్రవత్ శ్రీనులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొలాగని వెంకటేష్, సర్పంచ్ మెగావత్ సక్రీహనుమాన్ నాయక్, అధ్యక్షుడు రాజన్ నాయక్, భువగిరి మార్కెట్ డైరెక్టర్ దిరావత్ శ్రీనివాస్ నాయక్, మాజీ ఎంపీటీసీ పాచ్య నాయక్, సర్పంచ్ హరియ నాయక్, మంగ్త్య నాయక్, తెరాస మండల నాయకులు మెగావత్ జైపాల్, సరియా, హచ్యా, రవీందర్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామశాఖ అధ్యక్షులుగా కుక్కదువు ఉపేందర్ , ప్రధాన కార్యదర్శి గాబండి రాజు,ఉపాధ్యక్షులుగా రాసాల మల్లేష్, యూత్ అధ్యక్షులుగా నాగారం మహేష్ సోషల్ మీడియా కన్వీనర్‌గా కెంసారం రవిఏకలవ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలోనాయకులు తదితరులు పాల్గొన్నారు.
మోటకొండూర్ : గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని జెడ్పీటీసీ పల్ల వెంకట్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని వర్టూర్, ఇక్కుర్తి, చందేపల్లి, గ్రామాల్లో ఆ పార్టీ గ్రామ శాఖ కమిటీలను ఎన్నుకున్నారు. వర్టూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కదూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా ఆడెపు సుదర్శన్, సెక్రెటరీ జనరల్ గా పల్లె మైసయ్య, ఇక్కుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొలనుపాక ఉమాశంకర్, సెక్రెటరీ జనరల్ గా నర్సింహులు, సండే పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా దేవరకొండ శ్రీనివాస చారి, సెక్రెటరీ జనరల్‌గా బోట్ల శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దూదిపాల రవీందర్ ర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేష్ గౌడ్, మండల సెక్రెటరీ జనరల్ సిరబోయిన నర్సింగ్ యాదవ్, ఇక్కుర్తి సర్పంచ్ చామకూర అమరేందర్ రెడ్డి, భూమండ్ల ఐలయ్య, సింగిరెడ్డి నర్సిరెడ్డి, సుదగాని రాందాస్, హరీష్, చొప్పారి మొగులయ్య, ఆడెపు కష్ణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి : పురపాలక కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వార్డు కమిటీల ఎన్నిక నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి శ్రీనివాస్ ,పట్టణ శాఖ అధ్యక్షులు సీత వెంకటేశం హాజరై 10, 12వ వార్డుల కమిటీల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదో వార్డు అధ్యక్షుడిగా ప్రభాకర్ చారి, ఉపాధ్యక్షుడిగా కొయ్యడ అరుణ్, ప్రధాన కార్యదర్శిగా దొడ్డమూనీ దినేష్, 12వ వార్డు అధ్యక్షుడిగా దోరణల గణేష్, ఉపాధ్యక్షుడిగా బింగిరాజు, ప్రధాన కార్యదర్శి గా భారత హరిశంకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఎన్నికైన అధ్యక్షులకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ భాత్క లింగస్వామి, కౌన్సిలర్ దేవరాయ కుమార్ ,పట్టణ కార్యదర్శి గునిగంటి మల్లేశంగౌడ్, పట్టణ కార్యదర్శి సీత శ్రవణ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, అంకం పాండు,చీరాల నరసింహ , సంఘం చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.