Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని కారుచౌకగా అవుతుందని వాటి పరిరక్షణ కోసం ప్రజలు ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ అఖిలభారత కమిటీ పిలుపు మేరకు సోమవారం సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ,కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యా, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో సామాన్యులు జీవించలేని స్థితికి నెట్టబడుతున్నారు. అని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాశమ్, దండెం పల్లి సత్తయ్య పుఛ్చాకాయల నర్సిరెడ్డి,మైల యాదయ్య,కుంభం కష్ణారెడ్డి ,తుమ్మల పద్మ,భూతం అరుణ,అద్దంకి నర్సింహ,మధుసూదన్ రెడ్డి,గాదె నర్సింహ,గుండాల నరేష్,ఆకిటి లింగమ్మ,షాభిన బేగం, కునుకుంట్ల ఉమారాణి,శ్రీనివాస్ చారి,రాము,కార్తీక్ విజరు కుమార్, తదితరులున్నారు.