Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కనగల్ మండలకేంద్రంలోని వేముల నాగయ్య భవనంలో ఆ పార్టీ మండల ఏడో మహాసభను కానుగుల లింగస్వామి, కందాల శివలీల అధ్యక్షతన నిర్వహించారు. ఆ పార్టీ జెండాను సీనియర్ నాయకులు బ్రహ్మనందరెడ్డి ఎగుర వేశారు.అనంతరం వేముల నాగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయసాగు చట్టాలను తీసుకొచ్చి ద్రోహం చేసిందన్నారు. ఢిల్లీలో రైతులు ఆర్నెళ్లుగా ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే , విమానం , బ్యాంకులు, ఎల్ఐసీ,ఓడరేవులు, బొగ్గు ఘనులు , రోడ్లు అన్ని పెట్టుబడి దారులకు కారు చౌకగా అమ్మారన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడెకరాల భూపంపిణీ వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహసభలో మండల సహయ కార్యదర్శి కందుల సైదులు.మండల కమిటీ సభ్యులు కానుగు లింగస్వామి, అక్రం, నెలగొందరాషి, లింగయ్య, గుణాలపురి మారయ్య ,పాల్వాయి శివలీల, బ్రహ్మానందం రెడ్డి, యాదగిరి చారీ సోము ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.