Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
భువనగిరి:ఐద్వా జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో ఆ సంఘం పట్టణ 2వ మహాసభలు దండు స్వరూప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. నేేటి సమాజంలో అసమానతలతో మహిళా సమాజం స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదన్నారు . తమ హక్కుల కోసం పూర్తిస్థాయి స్వేచ్ఛ కోసం మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దాసరి మంజుల, నాయకురాలు దండు స్వరూప రాణి, తాడూరి కలమ్మ, గంధమల్ల బాలమణీ, మాటూరి కవిత, హిరే కార్ మౌనిక, భానోత్ అనిత, హేమలత, స్వప్న, మన్న బేగం, లావణ్య పుష్పలత, కల్పనలు పాల్గొన్నారు.