Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సూర్యాపేట కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో అధిక వర్షాల వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలూ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినరు కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావుతో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షల వల్ల జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు పొంగుతున్నాయని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని జాగ్రత్త చర్యలూ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు రైతుల పంటలు దెబ్బతినకుండా క్షేత్ర స్థాయి పర్యటన చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్, ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ, డీఏవో రామారావు నాయక్, సీపీవో వెంకటేశ్వర్లు, ఏవో శ్రీదేవి, పర్యవేక్షకులు పులి సైదులు తదితరులు పాల్గొన్నారు.