Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..
గురు పూజోత్సవంలో తెలంగాణ విద్యా వ్యవస్థపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం...?
నవతెలంగాణ - సూర్యాపేట
తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి పోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కరణ్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.గురుపూజోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఇందుకోసం ప్రయివేటు పాఠశాలల అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శలు చేశారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాల కనుసన్నల్లోనే తెలంగాణ విద్యా వ్యవస్థ నడుస్తుందని తెలిపారు. ఇంతటితో ఆగక నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణలో ఆంధ్ర విద్యా వ్యాపారులకు స్వేచ్ఛగా మారిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో విద్యావ్యవస్థ మారకపోతే తానూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇందుకోసం తనతో ఉపాధ్యాయులు కలిసి రావాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించిన కమిషనర్ కార్యాలయం ఆయన్ను సీఈఓగా విధుల నుంచి తప్పించింది.ఆయన స్థానంలో సూర్యాపేట ఆర్డీవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాజేంద్రకుమార్‌ను తాత్కాలిక సీఈవో నియమించింది.