Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కొద్దిపాటి వర్షమొచ్చినా జలమయమౌతున్న వీధులు
అ ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-మాడ్గులపల్లి
గ్రామీణవ్యవస్థ బలోపేతానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ మాటలు చేతల్లో కన్పించడం లేదు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకల్పనకు రూ.కోట్లు కేటాయిస్తున్నామని పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం.మండలంలోని పాములపహాడ్ గ్రామంలోని పలు వీధులన్నీ ఇటీవల కురిసిన వర్షాలకు వీధులన్నీ నీటికుంటలను తలపిస్తున్నాయి.సీసీరోడ్లు లేక వీధులన్ని గుంతలమయంగా మారాయి.నీటిలో దోమలు వృద్ధి చెందు తున్నాయి.ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.ఈవిషయమై సర్పంచ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామ స్తులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.