Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే మండపాలకు అనుమతి తప్పనిసరి అని ఇన్చార్జి ఎస్సై డి.రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈనెల 10న జరుగబోయే వినా యకచవితి ఉత్సవాలను కోవిడ్ నిబంధనలకు లోబడి జరుపుకోవాలని సూచించారు. మండపంలో 5 అడుగులలోపు విగ్రహాలను మాత్రమే నిలబెట్టుకోవాలలని పేర్కొన్నారు.విద్యుత్ అధికారుల అనుమతి తీసుకొని విద్యుత్‌లైట్ల ఏర్పాటుతో పాటు మండపం లోపల చుట్టుప్రక్కల, వెలుపల రాత్రివేళలో వెలుగు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.డీజీలకు అనుమతి నిషేధ మన్నారు.మండపంలో రాత్రిపూట ఇద్దరుముగ్గురు ఉండేలన్నారు.
తిరుమలగిరిసాగర్ : శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా ప్రశాంతవాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని తహసీల్దార్ పాండునాయక్, ఎస్సై సుధాకర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని శ్రీనివాస్ ఫంక్షన్హాల్లో మండలంలోని అన్ని గ్రామాల ఉత్సవకమిటీలకు గణేష్ఉత్సవాలపై అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, సర్పంచులు, ఉత్సవ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
గుర్రంపోడు: ప్రశాంత వాతావరణంలో వినాయకచవితి ఎన్నో జరుపుకోవాలని ఎస్.ఐ.పి.శ్రీనయ్య అన్నారు.స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో మండలంలోని ఎంపీటీసీలుసర్పంచులకు వినాయకచవితి పండుగ నిర్వహణ గురించి అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆన్లైన్ నమోదు చేసుకొని అనుమతిని పొందాలన్నారు గ్రామాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు మండపాలను ప్రధాన రహదారులలో కాకుండా వెనుక భాగాలలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన దారులలో ఏర్పాటు చేసి గ్రామంలోని వారికి రాకపోకల విషయంలో ఇబ్బందులు కలిగించొద్దన్నారు.మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేయొ ద్దన్నారు.వినాయక మండపాల వద్ద నిర్వహించే పూజా కార్యక్రమాలు భజనలు రాత్రి 10 గంటల లోపు ముగించాలని తెలిపారు. వినాయక నిమజ్జన సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది టీఆర్ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిట్యాల: మున్సిపల్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని ఉత్సవాలను శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు,గణెష్ ఉత్సవాలలో రాత్రిపూట యువకులు రోడ్లపై తిరగవద్దని సూచించారు, కరోన నిబంధనలు పాటించాలని సూచించారు.ఎస్ఐ రావుల నాగరాజు మాట్లాడుతూ విగ్రహం ఐదు ఫీట్ల కంటే తక్కువ ఉన్నట్లయితే పర్మిషన్ అవసరం లేదని,ఐదు ఫీట్ల కంటే పొడవు ఉన్న విగ్రహాలకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొవాలని సూచించారు.విద్యుత్ అధికారులతో మండపాలకు కనెక్షన్ తీసుకోవాలన్నారు.మైక్ పర్మిషన్ రాత్రి పది గంటల వరకు మాత్రమే మైక్‌కు అనుమతి ఉంటుందన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య,పట్టణ కార్యదర్శి శీల రాజయ్య, నారబోయిన శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య, జమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, చెర్కుపెల్లి శ్రీశైలం పాల్గొన్నారు.