Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భాషబోయిన భాస్కర్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని బీక్యాతండా, రామ లక్ష్మీపురం, ఎర్రవరం, అడ్లూరు గ్రామాల్లో నిర్వహించిన ఆ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికల్లో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలకు పరిశీలకులు నంద్యాల రామీరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జానిమియా, గండ్రాయి యాదగిరి పాల్గొన్నారు. అనంతరం ఎర్రవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నిరంజన్, దేవదాసు, వెంకట స్వామి, నాగేంద్ర, ప్రసాద్, సైదులు, శ్రీను టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బానోతు బేద్కర్, పాముల మస్తాన్, ఎర్రవరం పీఏసీఎస్ చైర్మెన్ నలజాల శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీలు శంకర్‌శెట్టి కోటేశ్వర్రావు, యరమాల క్రాంతికుమార్, చందు నాయక్, అంజిరెడ్డి, రావుల వెంకటేశ్వర్లు, వరదారవు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.