Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న భారత్‌బంద్‌కు పిలుపు ఇచ్చినట్టు ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వస్కుల మట్టయ్య, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకన్న, ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వస్కుల సైదమ్మ తెలిపారు. అఖిల భారత రైతు సమాఖ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం రెడపంగ మల్లయ్య అధ్యక్షతన స్థానిక మార్కెట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో ఎస్కే నజీర్, మచ్చ బాబురావు, గోపాలదాసు సుకన్య, వల్లపుదాసు వెంకన్న, మారయ్య, గోపి, నగేష్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.