Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిలుకూరు:వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమ పంట పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయా మని పలు గ్రామాలకు చెందిన రైతులు మంగళ వారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ నెల రోజులు గా వరి నాట్లు వేసినప్పటికీ పంట ఎదిగే సమయంలో వర్షాలు వచ్చి పంటలు నాచు పట్టి పోతున్నదన్నారు. స్పంది ంచిన ఎమ్మెల్యే పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు ఆదేశించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోటేశ్వర రావు కాసాని గోవిందు, ఉదరు, రెమిడి యాల ఆనంద రావు, బిట్టు, అంజి, నెమ్మది కుటుంబరావు ఉన్నారు.