Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - అడ్డగుడూర్
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఎండకట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. మంగళవారం మండలంలోని గోవిందాపురం గ్రామంలో ఆ పార్టీ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందన్నారు. దేశంలో ఉన్న 6700 కి.మీ ఉన్న జాతీయ రహదారులను అమ్మడానికి ప్రయత్నం చేస్తోంద న్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కూడా అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా సహించేది లేదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని లో రైతులు చేస్తున్న ఉద్యమానికి కేసీఆర్ ఎందుకు మద్దతు తెలపడంలేదని విమర్శించారు. పార్టీ ఆఫీసుల మీద ఉనంత ప్రేమ రైతుల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. పేరుకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) పోరాటాలు చేస్తోందన్నారు. జిల్లాలో అనేక ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయన్నారు. గ్రామాలలో లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అధిక వర్షాల వల్ల ప్రజా జీవనం స్థంభించిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లయాదగిరి,గుండు వెంకటనర్సు, మండల నాగేశ్వరరావు , వల్లంభట్ల శ్రీనివాస్ రావు, బుర్ర అనిల్ కుమార్ పాల్గొన్నారు.