Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -వలిగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం గోకారం గ్రామలో పార్టీ మహాసభను బాబు నారాయణ, సిరసంగి శ్రీ రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి ప్రస్తుతం మాట మార్చిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధుల పేరుతో అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ విస్మరించం దన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ 30 శాతం 20 శాతం మాత్రమే వేసినట్టు తెలిపారు. బడ్జెట్లో కేవలం 2 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదన్నారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా నిత్యావసర , పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతుందన్నారు. జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూంలు ఇప్పటికీ ఊసే లేదన్నారు .జిల్లాలో కేవలం నాలుగు గ్రామాలలో 33 మందికి మాత్రమే సాగుకు పనికిరాని భూమి ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య ,,జిల్లా కమిటీ సభ్యులు స్వామి స్థానిక సర్పంచ్ తుర్కపల్లి మాధవి, మండల నాయకులు తుర్కపల్లి సురేందర్, నారి రామస్వామి ,మద్దెల హనుమంతు, పబ్బు నరసింహ, సురేష్ పాల్గొన్నారు.