Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని వైఆర్పీ ఫౌండేషన్ ఆర్గనైజర్ యామ దయాకర్ అన్నారు.గణేష్ చతుర్థిని పురస్కరించుకుని మంగళవారం వైఆర్పీ ట్రస్ట్ కార్యాలయంలో వైఆర్పీ ఫౌండేషన్, సాక్షి దినపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో మట్టిగణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆర్గనైజర్ యామ దయాకర్ మాట్లాడుతూ రసాయనరంగులను వినియోగించి తయారు చేస్తున్న గణేష్ విగ్రహాలను పూజించి నిమజ్జనం చేసే సమయంలో నీటి కాలుష్యం ఏర్పడడంతో పాటు ఆ నీటిని పశువులు సేవించడం వల్ల అనారోగ్యానికి గురి కావడం, చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భావితరాలకు మనమంతా ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని చెప్పారు.వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిఏడాది సామాజిక బాధ్యతతో మట్టిగణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు.కరోనా విపత్కర పరిస్థితులున్నా ప్రజలలో చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ఈ ఏడాది సైతం మట్టి విగ్రహాలను సాక్షి దినపత్రికలో కలిసి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్ర మంలో సాక్షి బ్రాంచి మేనేజర్ గణేష్, రామాలయం డైరెక్టర్ కక్కిరేణి లక్ష్మీనారాయణ, రామకోటి స్తూప ఆలయచైర్మెన్ బండారు వెంక టేశ్వర్లు, అర్రూరు సత్యనారాయణ, వీరెల్లి సతీష ్కుమార్, లకుమారపు శ్రీనివాస్, కోటగిరి రామకష్ణ, రేపాల భద్రాద్రి రాములు, కర్నాటి నగేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.