Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-వేములపల్లి
పాఠశాలలో విద్యార్థులు,ఉపాధ్యాయులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని డీఈవో భిక్షపతి అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.తరగతిగదిలో విద్యార్థికి, విద్యార్థికి మధ్య ఆరడుగుల దూరం ఉండాల న్నారు.విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ను సంప్రదించాలన్నారు.మధ్యాహ్న భోజనం నిర్వహణ పరిశుభ్రంగా ,రుచికరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.18 నెలలుగా పాఠశాలలకు దూరంగా ఉన్న విద్యార్థులకు సమర్థవంతంగా అర్థమయ్యేలా పాఠాలు బోధించాలన్నారు.ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి, ఉపాధ్యాయులు ఉన్నారు.