Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్పీ చైర్పర్సన్
గుజ్జా దీపికా యుగంధర్
నవతెలంగాణ-సూర్యాపేట
పేదల సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధి కారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్ కోరారు. మంగళవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఒకటి, ఏడవ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి సీఈవో రాజేంద్రకుమార్తో కలిసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చూడాలన్నారు. హుజూర్నగర్ జెడ్పీటీసీ మాట్లాడుతూ విద్యుత్ తీగలు వేలాడుతున్నా సరి చేయడం లేదని, విరగిన స్తంభాలు తొలగించడం లేదన్నారు. ఈ విషయంపై పర్యవేక్షక ఇంజినీర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత కూడా పనులు సాగు తాయన్నారు. చివ్వేంల జెడ్పీటీసీ మాట్లాడుతూ వర్షాలతో చెరువు కట్టలు తెగిపోయే అవకాశం ఉందని, వాటిని గుర్తించి చర్యలు చేపట్టాలని అధి కారులను కోరారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ పాఠశాల వేళలు, ఉద్యోగుల సమయానుకూలంగా ఆర్టీసీ బస్ సర్వీసులు కొనసాగించాలన్నారు. జాజిరెడ్డిగూడెం జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమవేశంలో జాజిరెడ్డి గూడెం, మట్టంపల్లి, చివ్వేంల, హుజుర్నగర్, మోతే మండలాల జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.