Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
లౌకిక భారతదేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషబీజాలను విస్తరింపజేసి మత విధ్వంసాలను సష్టించి ప్రభుత్వ ఆస్తులను ప్రవేట్ పరం చేయడానికి చేస్తున్న కుట్రలను భగం చేస్తేనే దేశ భవిష్యత్ ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మలవీరారెడ్డి పేర్కొన్నారు. మంగళ వారం స్థానిక గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన పార్టీ మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.మహాసభలో మండల మాజీ కార్యదర్శి గాలి నర్సింహ పార్టీ జెండాను ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల కార్యదర్శి చెరుకు పెద్దులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో కూడ బెట్టుకున్న ప్రభుత్వఆస్తులను పెట్టుబడిదారి వర్గాలకు అప్పనంగా అందించేందుకుగాను బీజేపీ ప్రభుత్వం కుట్ర పండుతుందని విమర్శించారు. దేశంలో మత విధ్వంసం సష్టించేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తూ రైతులను దివాలా తీసే విధంగా నల్లచట్టాలను ప్రవేశపెట్టిందన్నారు. మరోవైపు కరోనా విజంభిస్తున్న తరుణంలో కట్టడికి ఏలాంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో కులం, మతం, జాతి అని చూడకుండా ప్రజలందరూ తిరగబడితేనే బీజేపీ కుట్రలను కట్టడి చేయొచ్చన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, వెంటనే అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ధర్మారెడ్డి కాలువ పిల్లాయిపల్లి కాలువలకు నిధులు కేటాయించి పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామోజు వెంకటేశ్వర్లు, జిట్ట నగేష్, వైస్‌ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్, కుమ్మరి శంకర్, జాల యాదమ్మ, చింతపల్లి బయ్యన్న పాల్గొన్నారు.