Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిందితున్ని పోక్సో చట్టం ద్వారా శిక్షించాలి
నవతెలంగాణ-దేవరకొండ
చైత్ర కుటుంబాన్నితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితుడిని పోక్సో చట్టం ద్వారా శిక్షించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు నిమ్మల పద్మ, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు బుడిగ వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఐద్వా, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరా బాద్‌లోని సింగరేణి కాలనీలోనున్న ఆరేళ్ల పసిపాప చైత్రపై రాజు అనే ఒక కామాంధుడు లైంగికదాడి చేసి దారుణంగా హత్య చేశాడన్నారు. రాష్ట్రంలో ఏం జరుగు తుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడు తుందన్నారు.ఆ పసిపాప కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘం నాయకులు లెంకలపల్లి సుజాత, సరస్వతి, కళావతి, జాంగీర్బీ, ఎస్ఎఫ్ఐ నాయకులు మౌనిక, శాన్వి, సుమలత పాల్గొన్నారు.గిరిజన బిడ్డ చైత్ర అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేవరకొండలో ఎన్ఎస్ యూఐ నాయకులు నేనావత్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక మీనాక్షి రోడ్ నుంచి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్నాయక్, అజీజ్, సోహెల్, పవన్, సంతు, రాజేశ్, నందు, హరి, నవీన్, సన్ని, సుమన్, రవి, బాలు, రాము, మహేష్ పాల్గొన్నారు.
త్రిపురారం : దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని లంబాడీ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు రమావత్ చంటినాయక్ ఆరోపించారు.ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు, దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి చైత్రపై లైంగికదాడికి పాల్ప డడంతో పాటు హత్య చేయడం దారుణ మన్నారు.
నాగార్జునసాగర్: హైదరాబాద్ సింగరేణి కాలనీలో చైత్రను హత్య చేసిన నిందితున్ని శిక్షిం చాలని ఐదో వార్డు కౌన్సిలర్ రమేష్‌జీ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఆయన వెంట 9వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ, సపావత్ చంద్రమౌళి, 9వ అధ్యక్షులు మసీదు రాము, ఐదో వార్డు అధ్యక్షుడు బండి చెన్నకేశవులు పాల్గొన్నారు.అదేవిధంగా చైత్ర కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు కొర్రా శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు. నిందితున్ని శిక్షించాలని కోరారు.
మాడ్గులపల్లి: హైదాబాద్ సింగరేణి కాలనిలో ఆరేండ్ల చిన్నారి చైత్రను హత్య చేసిన నిందితున్ని శిక్షించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.
సూర్యాపేట : హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి చైత్రపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు హత్య చేసిన నిందితున్ని శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు.ఈ విషయమై ఆదివారం జిల్లాకేంద్రంలోని పీఓడబ్య్లూ కార్యాలయం సమీపంలో మహిళలు నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగమణి, వీరమ్మ, మల్లమ్మ,ఝాన్సీ,నాగమణి పాల్గొన్నారు.
పెద్దవూర: మండలకేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై కొవ్వొత్తుల ర్యాలీనిర్వహించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురళీకృష్ణ, సంతోష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పాలకవీడు: మండలంలోని జాన్‌పహాడ్ దర్గా గ్రామపంచాయతీ హెల్మెట్ తండాలో గిరిజనశక్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుబ్బారావు, బెట్టెతండా సర్పంచ్ మోతీలాల్, వార్డు సభ్యులు ఎస్కె. సైదులు, వెంకటేశ్వర్లు, రాంబాబు, నాగుల్‌మీరా పాల్గొన్నారు.
హాలియా: పట్టణంలో చిన్నారి చైత్ర చిత్రపటానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారపు నరేష్ పూలమాలలేసి నివాళులర్పించారు.