Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
నిరంతరం సమాజానికి సేవలందిస్తున్న రోడ్డు రవాణా కార్మికులకు ఆర్థిక భద్రత, సామాజికభద్రత కల్పించాలని తెలంగాణ పబ్లిక్, ప్రయివేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) ప్రధానకార్యదర్శి పి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని తేజ టాలెంట్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ కార్మికుల జిల్లా కమిటీ సమావేశం లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణి కులకు రవాణా సౌకర్యం, వస్తువుల రవాణా చేయడంలో కార్మికులు కీలకపాత్ర పోషిస్తు న్నారన్నారు.దేశ ఆర్థికాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తున్నారన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులను హరించి వేస్తున్నాయని విమర్శించారు. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు, పాఠశాల బస్సులపై పని చేసి కార్మికులకు కనీస వేతనాలు లేవన్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరిరావు మాట్లాడుతూ మోటార్ వాహనచట్ట సవరణ వల్ల ట్రాన్స్‌పోర్టు రంగం సంక్షోభంలోకి వెళ్లడం, కార్మికుల హక్కులకు విఘాతం కలుగుతుందన్నారు.తమ సమస్యల పరిష్కారానికి సంఘటితమై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంబాబు, కోటగిరి వెంకటనారాయణ, రాధాకష్ణ, పట్టణ కన్వీనర్ ముత్యాలు, దాసరి శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ నాయకులు దేవేందర్‌రెడ్డి, సైదులు, నర్సింహారావు, నాగరాజు,సైదులు పాల్గొన్నారు.