Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు
అ మతదేహంతో సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన
అ పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
విద్యుద్ఘాతంతో గిరిజన రైతు మృతిచెందాడు. అధికారుల నిర్లక్ష్యమే కారమణంటూ బంధువులు సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని పోర్ల గడ్డ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పొర్ల గడ్డ తండా కు చెందిన వడత్య భీముడు( 60) ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ అంతరాయాన్ని సరిచేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించాడు. ఆదివారం పశువులకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి కరెంట్ వేస్తుండగా షాక్‌కు గురై మృతిచెందాడు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే భీముడు విద్యుద్ఘాతానికి గురై మృతిచెందాడని అధికారల నిర్లక్ష్యమే కారణంటూ గ్రామస్తులు , బంధువులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు మృతదేహంతో బీటిమీదితండా సమీపంలోని 133కేవీ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్తు ఏ ఈ నీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మతునికి తక్షిణ ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలు అందజేయాలని, రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ మతదేహంతో గంటల తరబడి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టినా రెవెన్యూ, పోలీస్,విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. సంబంధిత అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు అంటూ భీష్మించారు. మృతునికి భార్య, ఐదుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ధర్నాలో మాజీ ఎంపీపీ వాంకుడోత్ బుజ్జి కాంగ్రెస్ నాయకులు కరెంటు బిక్షపతి నాయక్ మందుల బాలకష్ణ పోర్ల గడ్డ తండా సర్పంచ్ వడత్యా సుజాత తుకారం, ఉప సర్పంచ్ లచ్చు నాయక్, బోటి మీది తండ సర్పంచ్ రెడ్యా నాయక్, పల్లగుట్ట తండా సర్పంచ్ కిషన్ నాయక్ పాల్గొన్నారు.