Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతన్న సినిమాను ఆదరించండి
అ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
నవ తెలంగాణ - ఆలేరుటౌన్
దుక్కులు దున్నే రైతన్నలు హక్కుల కోసం ప్రశ్నిస్తే చేతులకు బేడీలు ఎందుకు వేస్తున్నారని పీపుల్ స్టార్ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మండలకేంద్రంలోని వైఎస్ఎన్గార్డెలో తాను నటించి దర్శకత్వం వహించి నిర్మించిన రైతన్న సినిమా విజయవంతం చేయాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా కార్యవర్గ కార్యదర్శివర్గసభ్యులు మంగ నర్సింహులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు . అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. కుటుంబంతో కలిసి సినిమా చూసే పరిస్థితి నేడు లేదని చెప్పారు. రైతన్న సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని కోరారు . రైతన్న ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సినిమా రూపంలో ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ఆర్డినెన్సు లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వానికి అటు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం రైతన్న సినిమాను నిర్మించినట్టు తెలిపారు. ఈనెల 17వ తేదీన భువనగిరి లోని ఓంకార్ థియేటర్ లో ప్రారంభమవుతుందని జిల్లా ప్రజలందరూ ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రైతాంగాన్ని కూలీలు గా మార్చే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ,సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జనార్దన్ ,రాష్ట్ర సహాయ కార్యదర్శి కెమిడి ఉప్పలయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు, సీపీఐ జిల్లా కార్యదర్శిచెక్క వెంకటేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వడ్డెమాన్ శ్రీనివాస్, బెజడి కుమార్, ఇక్కిరి సహదేవ్, ఆడ వయ్య, రాజేష్, మల్లేశం ఎండి.సలీం, అంజిబాబు ,పాండు, శ్రీనివాస్, మొరిగాడి రమేష్ ,సుంచు దేవయ్య, మల్లేశం , తదితరులు పాల్గొన్నారు.
రైతుల పాలిట శాపంగా నూతన వ్యవసాయ చట్టాలు
యాదాద్రి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయని ప్రముఖ దర్శక నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయపరమైన రైతుల డిమాండ్‌ను చట్టపరం చేయాలన్నారు. రైతుల పాలిట గుదిబండగా మారిన అగ్రి చట్టాలను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు చట్టబద్దత కల్పించి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతే రాజు అంటూనే రైతాంగం వెన్ను విరవడం న్యాయం కాదన్నారు. అన్ని రంగాలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసినట్లు వ్యవసాయం కూడా చేయకూడదన్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఏమాత్రం భయం చెందకుండా ఆరుగాలం శ్రమించి అన్నం పెడుతున్న రైతు రుణం తీర్చుకునే చర్యలు తీసుకోండని భారత ప్రధాని మోదీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ యాదాద్రి జిల్లా కార్యదర్శులు ఎండి.జహంగీర్, గోద శ్రీరాములు, మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ దండెబోయిన అనిల్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, సీపీఐ(ఎం) యాదగిరిగుట్ట మండల కార్యదర్శి బబ్బూరీ పోశెట్టి, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు షేక్ లతీఫ్, పార్టీ మండల కమిటీ సభ్యుడు ఉస్మాన్ షరీఫ్, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు కళ్లెం క్రిష్ణ, యాదగిరిగుట్ట మండల పార్టీ కార్యదర్శి బబ్బూరీ శ్రీధర్, సహాయ కార్యదర్శి జిల్లా జానకీరాములు, పట్టణ కార్యదర్శి గోపగాని రాజు, సహాయ కార్యదర్శి పొన్నబోయిన వెంకటేశ్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ పేరబోయిన మహేందర్, తదితరులు పాల్గొన్నారు.