Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
త్యాగాల పునాదులతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను సీఎం కేసీఆర్ బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని మాజీ మంత్రి వర్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ధ్వజమెత్తారు.ఇప్పటికే దళిత సీఎం అని మోసం చేసిండు, డిప్యూటీ సీఎం అని తాటికొండ రాజయ్యను మోసం చేసిండు, దళిత ఎమ్మెల్యే సంపత్‌ను సస్పెండ్ చేసిండని గుర్తు చేశారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో మోసగిస్తున్నాడని విమర్శించారు.చేపలకు ఎరవేసినట్లు ఓట్లకోసమే దళితబంధు పథకాన్ని ఎరవేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని, నిరుద్యోగులకు ఉద్యోగాలని, పిల్లలకు కేజీ టు పీజీ అని మోసం మోసగించాడని ఆరోపించారు.దళిత, గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామని మోసం చేసిండన్నారు.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించకుండా, వున్న నిధులను పక్కదారి పట్టించాడని ఆరోపించారు. రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధుల కోసం 8.10లక్షల మంది లబ్దిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వరద సాయం రూ.10వేలు ఇస్తానని చేసిండని విమర్శించారు. పోడు వ్యవసాయం చేసే వారిపై దాడులు చేయించడమే కాదు.. నేరెళ్ల ఘటనలో దళితులపై దాడులు చేయించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు.తుంగతుర్తి నియోజక వర్గంలో దళితబంధు ఇవ్వకుంటే కేసీఆర్, ఎమ్మెల్యే గాదరికిశోర్కుమార్కు కర్ర కాల్చి వాత పెడ్తామని హెచ్చరించారు.కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ ఒక్క దళితులే కాదు..రాష్ట్రంలో అన్ని కులాలను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారన్నారు.కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తే.. దాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారన్నారు.ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చాడని, దమ్ముంటే అన్ని కులాలకు బంధు ఇవ్వు, అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ మాట్లాడుతూ ఎన్నికల కోసమే కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారని ఆరోపిం చారు.రాష్ట్రంలో 67 లక్షల మంది దళితులు ఉంటే ఏడేండ్లుగా వారి కోసం ఏం చేయలేని కేసీఆర్ ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దళిత బంధును తీసుకొచ్చారని ఆరోపించారు. అంతకుముందు కాంగ్రెస్శ్రేణుల బైక్ ర్యాలీతో జనసంద్రంగా మారింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బైరు శైలేందర్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొమ్ము జోహార్,మండల అధ్యక్షులు కిషన్‌రావు, గుంజ రేణుక,పోతుల వేణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రేణుక, శాలిగౌరారం మండల అధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, అడ్డగూడూరు మండల అధ్యక్షులు పోలబోయిన లింగయ్య, కాంగ్రెస్ యువ జన సంఘం నాయకులు నాయకులు కొండరాజు, పెద్దబోయిన అజరు, ముక్కాలఅవిలమల్లు, నరేష్, కరుణశ్రీగిరిధర్‌రెడ్డి,మద్ది శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.