Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలో అత్యంతవెనుకబడిన మైనార్టీల అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ బంధు పథకాన్ని ప్రకటించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని గాంధీపార్కులో ఆవాజ్ జిల్లా నాయకులు షేక్ జహంగీర్ అధ్యక్షతన నిర్వహించిన మైనార్టీల జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకొచ్చాక మైనార్టీలపై దాడులు,హత్యలు పెరిగి పోయా యన్నారు. మైనార్టీలకు రక్షణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన మత సామరస్యం,లౌకిక విలువలను మంటగలిపే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని విమర్శిం చారు.రాష్ట్రంలో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మతాల మధ్య వైషమ్యాలు సష్టించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.మైనారిటీల ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఆవాజ్ నిరంతరం కషి చేస్తుందన్నారు.లౌకికవాదం, మత సామరస్యం గురించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అనేక పోరాటాలు చేస్తున్నదన్నారు.రిజర్వేషన్లు,మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లోన్స్, షాదీముభారక్,మైనారిటీ స్కాలర్షిప్లు, వక్ఫ్ భూముల పరిరక్షణ తదితర అంశాలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తు ందన్నారు. అన్యాక్రాంతం అవుతున్న వక్ఫ్భూముల రక్షణ కోసం మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మతోన్మాదశక్తులు మైనారిటీలపై చేస్తున్న దుష్ప్ర చారాన్ని తిప్పికోడుతూ వాస్తవాలు ప్రజలకు తెలుపుతూ లౌకిక విలువల పరిరక్షణకు ఆవాజ్ పాటు పడుతుందన్నారు. రాష్ట్రంలో మైనారిటీలు విద్య, ఉద్యోగాలలో వెనుక బడి ఉండి పేదరికంలో కొట్టుమిట్టాడు తున్నారన్నారు. చిన్నచిన్న వత్తులు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నా రన్నారు.68 శాతం కుటుంబాలు అప్పుల ఊబిలో కురుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.బడ్జెట్లో మాత్రం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు పెరగడం లేదన్నారు. ఇలాంటి నేపథ్యంలో మైనార్టీల అభివద్ధి కోసం మైనార్టీ బంధు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.సదస్సు అనంతరం ఆవాజ్ జిల్లా కమిటీని ఎన్ను కున్నారు.ఆవాజ్ జిల్లా అధ్యక్షులుగా ఫక్రుద్దిన్,జిల్లా కార్యదర్శిగా జహంగీర్,ఆశ్రర్లతో పాటు మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్ను కున్నారు.ఈ సదస్సులో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజిజ్ హైమద్ఖాన్,ముస్లిం మైనారిటీ నాయకులు ఫక్రుద్దీన్, ఆశ్రర్, ఖాదర్, సైదులు,ఫయాజ్,అబిద్, ఇమ్రాన్, మునీర్బాబా, జానీ, నజీర్, అబ్దుల్ హైమద్, ఎండి ఫయజుద్దీన్, ఆరిఫ్, మీరా, సయ్యద్, ఫయాజ్ఖాన్ పాల్గొన్నారు.