Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
సామాన్య రైతులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధిక భారాలు మోపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో జరిగిన బహిరంగసభ నుద్దేశించి ఆయన మాట్లాడారు.నాడు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టులు రైతాంగ పోరాటం నిర్వహించి సాధించుకున్న హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు చిన్నాభిన్నం చేస్తున్నాయ న్నారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రైతులపాలిట శాపంగా మారిందన్నారు.రైౖతాంగ హక్కుల కోసం రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరి స్తుందన్నారు.రానున్న ఎన్నికలలో కేేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, స్వాతంత్య్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు, మాజీ జిల్లా కార్యదర్శి గన్న చంద్రశేఖర్, మండవ వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో మల్లారెడ్డిగూడెం గ్రామచరిత్ర మరువలేనిది
చింతలపాలెం : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మల్లారెడ్డిగూడెం గ్రామచరిత్ర మరువలేనిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు.మల్లారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు.అనంతరం సభాధ్యక్షులు ఉస్తెల నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.అమరులను స్మరిస్తూ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు.తెెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన మల్లారెడ్డి గూడెం వాసులు యరబోలు అప్పిరెడ్డి, నందిరెడ్డి నర్సిరెడ్డి, వీరయ్య, కందుల గోపిరెడ్డి, చింతిరాల రామస్వామి, పేరుపంగు భుషమ్మ, పేరుపంగు తిరపతమ్మ, అలుగులవీరమ్మ 8 మందికి జోహార్లర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, ఉస్తెల సజన, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, రాములు, ధనుంజయ నాయుడు, కొప్పొజు సూర్యనారాయణ, జడ శ్రీనివాస్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లీశ్వరి, కోటమ్మ, మండల కార్యదర్శి చింతిరాల రవి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు షేక్ జియాలుద్దీన్, గ్రామ కార్యదర్శి దొంగల అంకరాజు, అబ్దుల్ బాషా, తోకల సైదులు, గంధం మంగయ్య, గొంగరెడ్డి వెంకటరెడ్డి, చింతలచెర్వు కొండా, గంధం కొండా పాల్గొన్నారు.