Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నకిరేకల్
రైతుల జీవితాలను ఆవిష్కరిస్తూ పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను ఆదరరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన రైతన్న సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఆదాని, అంబానీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులను కూలీలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని నటుడు నారాయణమూర్తి తీసిన సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్‌గౌడ్, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.