Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపేట : కార్యకర్తలు టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మీనాక్షి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండలసమావేశాన్ని రాజి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మలు అన్నారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. .బీసీ విభాగం అధ్యక్షుడిగా మారిశెట్టి సత్యనారాయణ , మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎడ్ల ఎడ్ల బాలలక్ష్మి ,మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎండి.కరీం ,ఎస్సీ అధ్యక్షులుగా కొమ్ము పాండు ,సోషల్ మీడియా కన్వీనర్ గా ముచ్చు శివ కుమార్ యాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు గా కొండం మహేందర్ రెడ్డి ,కార్మిక విభాగం అధ్యక్షులు విజరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికా రి గాదె పాక నాగరాజు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమని, జెడ్పీటీసీ గోపాల్ ,సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ఆడదు ఈశ్వరమ్మ ,ఆల్డా రాష్ట్ర చైర్మెన్ పిచ్చి రెడ్డి , పీఏసీఎస్ చైర్మెన్ భాస్కర్ రెడ్డి ,మదర్ డైరీ డైరెక్టర్ గాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.