Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివద్ధే తన ధ్యేయమని చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలోని 3వ వార్డులోని ఎస్సీ కాలనీలో 10లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆ వార్డు కౌన్సిలర్ బండమీది మల్లేశంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని సమస్యలు అంచెలంచెలుగా పరిష్కరించి అభివద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్‌బాబు, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులుగౌడ్, నాయకులు ఉబ్బు వెంకటయ్య, మాందోరి గాలయ్య, ఎర్రగోని లింగస్వామి, సందగల్ల సతీశ్‌గౌడ్, బత్తుల స్వామి పాల్గొన్నారు.