Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీఆర్సీ ప్రకటనే కాకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు 58ఏండ్ల నుండి 61 ఏండ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇంకా ఇతర సమస్యల పరిష్కారానికి కూడా అనేక జీవోలు జారీ చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ మాట్లాడుతూ నల్లగొండ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన జిల్లాగా జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్ నిలిపారని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉపాధ్యాయుల లోకల్ క్యాడర్ గుర్తింపు జీవోను జారీ చేయడం ద్వారా ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు మార్గం సుగమమైందన్నారు. అందుకు ముఖ్యమంత్రి గారికి కతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సుంకరి బిక్షంగౌడ్ వరుసగా ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కాళం నారాయణరెడ్డి లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.బిక్షపతి, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసులు, మాజీ పత్రికా సంపాదకులు గానూతల వెంకట్ రెడ్డి, మాజీ జిల్లా బాధ్యులు కోమటిరెడ్డి నర్సింహ్మా రెడ్డి, బసిరెడ్డి రవిందర్ రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మేకల జానారెడ్డి, తీగల శ్రీవిద్య, అనిత, పీఆర్టీయూ అనుబంధ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, యాదాద్రి జిల్లా అధ్యక్షులు మోటె సత్తయ్య, ఎన్నికల అధికారిగా విచ్చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి శుభాకర్ రెడ్డి, డీవీఎస్ ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.