Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తుర్కపల్లి ఘటనలో ఐదుగురి సస్పెండ్
అ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
టీిఆర్‌ఎస్‌కు నష్టం చేసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం గుట్టలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొంతమందితో ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇబ్బందులకు గురవుతుందన్నారు. తుర్కపల్లి మండల కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించినా కొంతమంది కావాలనే రచ్చ చేశారన్నారు.డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించడం దారుణమన్నారు.ఈ సంఘటనలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ శ్రీనివాస్ తో పాటుతుర్క పల్లి సర్పంచ్ భర్త శ్రీనివాస్ ,నాయకులు నరేష్,సామల కర్ణాకర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కమిటీ ఎన్నికలు సామాజిక న్యాయం ఉండే విదంగా జరుగుతున్నాయన్నారు. అన్ని కులాలకు స్థానం కల్పించే విదం గా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.ఇప్పటికే ప్రకటించిన కమిటి ల లో మెజారిటీగా బలహీన వర్గాల నాయకులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుపెలిమేల్లి శ్రీధర్ గౌడ్, సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి,పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సత్యం యాదవ్,నాయకులు బిట్టు కుమార్ లకన్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత గులాబీ సైన్యందే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత గులాబి సైన్యానికి ఉందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలో నిర్వహించిన టీిఆర్‌ఎస్ మండల కమిటీ ఎన్నికల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం పై అవాకులు చెవాకులు పేలుతున్నయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.దళితులకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చిందని తెలిపారు.ఈ పథకం ద్వారా దళితులు ఆర్థిక అభివద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కల్యాణ లక్ష్మి,రైతు బీమా ,రైతు బంధు ,ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు.ఈ సమావేశంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మండల అధ్యక్షులు కర్రే వెంకటయ్య,జెడ్పీటీసీ తోటకూరి అనురాధ,ఎన్నికల పరిశీలకులు బాల్ నర్సయ్య, సోమిరెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య భైరగాని పుల్లయ్య, అంకం నరసింహ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.