Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి .జహంగీర్
నవతెలంగాణ -ఆలేరు టౌన్
తెలంగాణ సాయుధ వీరుల వారసత్వాన్ని నేటి యువత కొనసాగించాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు .తెలంగాణ సాయుధ పోరాట వీరుల సంస్మరణ వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ గడ్డ విముక్తి కోసం నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి స్వాతంత్య్రం అందించిన నాయకులను స్మరించుకోవాలని తెలిపారు. తెలంగాణలో వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీ, దొరల దురాచారాలకు వ్యతిరేకంగా మహిళలను రైతులను సమీకరించి నిజాం వ్యతిరేక ఉద్యమాలు సాగాయన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం యువత కషి చేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎటువంటి పాత్ర లేని బీజేపీ విమోచనం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నదన్నారు. బీజేపీ మతతత్వ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు .పట్టణ కార్యదర్శి ఎంఎ.ఎక్బాల్ అధ్యక్షత న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, మండల కార్యదర్శి మొరిగాడి రమేష్, వడ్డేమాన్ శ్రీనివాసులు ఘన గాని మల్లేష్ ,డీవైఎఫ్ఐ నాయకులు చెన్న రాజేష్, భువనగిరి గణేష్ ,మాదాని నవీన్, గజ్జల నర్సింహులు ,మోరిగాడి అశోక్, గొడుగు దాస్, కళ్యాణ్ ,కట్కూరి హనుమంతు 'మోరి గాడి అంజయ్య, మోడీ గారి లక్ష్మణ్ ,తదితరులు పాల్గొన్నారు.
27 భారత్ బందును విజయవంతం చేయాలి
భూదాన్‌పోచంపల్లి : ఈ నెల 27 తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కనుముక్కల గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ మండల మహాసభలో వారు మాట్లాడారు. . భారత్‌బంద్ 27న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. బీజేపీ ప్రబుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ ,రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజలమీద భారాలు మోపుతున్నాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేటి వరకు అమలు చేయలేదన్నారు. టీిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గూడూర్ అంజిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి ,లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి ,మంచాల మధు ,అందెల జ్యోతి, నెల కంటి జంగయ్య ,లాలయ్య, శివ, రమేష్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.