Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మురళీధర్
నవతెలంగాణ-మోత్కూర్
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.5 లక్షల బీమా అమలులో ప్రభుత్వం విఫలమైందని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ అన్నారు. ఆదివారం మోత్కూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత రంగ అభివద్ధికి ప్రభుత్వం రూ.73.5 కోట్ల నిధులు విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళ క్రితం సిరిసిల్లలో కేటీఆర్, ఇటీవల సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు బీమా అమలు చేస్తామని ప్రకటించారని, ఆచరణలో మాత్రం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న 300 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, మగ్గం నేసే కార్మికులకు నెలకు రూ.3 వేలు ప్రోత్సాహకంగా అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండు వెంకటనర్సు, సహాయ కార్యదర్శి కూరపాటి రాములు, తాటి కరుణాకర్, కూరపాటి జయమ్మ , వేముల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.