Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని సుద్దాల గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం ఎస్ఐ బి.తిరుపతి ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం యూత్ సభ్యులు ఎస్ఐని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మహౌదరు గౌడ్, శ్రీనివాస్, సాజన్, వంశీ, భరత్ మురళి మహేందర్ వినరు పవన్,క్రాంతి,కార్తిక్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బీర్ల అయిలయ్య పూజలు
రాజపేట : మండలంలోని కాల్వపల్లి గ్రామంలో వినాయకుని మండం పద్ద కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య పూజలు చేశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీి-327 ఆలేరు సబ్ డివిజన్ అధ్యక్షులు ఇంజ మహేష్, కాంగ్రెస్ నాయకులు ఇంజ బాబు, ఇంజ రాజు, చేర్యాల వినోద్, చేర్యాల నరేష్, ఇంజ రాజు, చేర్యాల అనిల్, ఇంజ వినరు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ :మండలంలోని సిరి వేణి కుంట గ్రామంలో శనివారం రాత్రి టీిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల స్వాతి-రాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల అనిత వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు కుతాడి సురేష్, వల్లపు విజరు, గాజుల నవీన్,కవడి నవీన్,పల్లపు రాజు,ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, గొదసు అనిల్ పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని వెల్లంకి గ్రామంలో పాతకోట ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఇడెం శ్రీనివాస్ రాధ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ఎంపీటీసీ-2 తిమ్మాపురం మహేందర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పున్న శ్రీనివాస్, దేవరకొండ ఉపేంద్ర చారి, ఇడెం శ్రీనివాస్, ప్రసన్న, రుద్ర వెంకటేష్, వనం లెనిన్, గుర్రం వేణు, బుట్టి వెంకటేష్, ఇడెం మణికుమార్ పాల్గొన్నారు.
చండూరు : గణేష్ నవరాత్రులు ముగించుకొని ఆదివారం నిమజ్జన వేడుకలు మండలంలో పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న ,అనపర్తి శేఖర్ గుంటి వెంకటేశం, మంచుకొండ కీర్తి సంజరు, కొండ్రెడ్డి యాదయ్య, కో ఆప్షన్ సభ్యులు, ట్రస్మా జిల్లా కార్యదర్శి కోడి శ్రీనివాసులు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూతరాజు దశరథ, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.