Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ అన్నారు. ఆదివారం మండలంలోని వెల్మజాల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆయన జ్ఞానమాల వేసి మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్కు అన్ని రాజకీయ పార్టీల ప్రతిపక్ష నాయకులు శాసనసభ్యుడు ఆమోదించేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్చైర్మెన్ వంతెన మణి,ఆ సమితి నాయకులు నాయకులు కొమ్మగళ్ళ ఎల్లయ్య, కొమ్మగళ్ళ చంద్రయ్య,గుర్కు అయోధ్య,కచ్చిగల్ల కష్ణ,జేరిపోతుల యాదగిరి, గుర్కు స్వామి, జేరిపోతుల వెంకటేష్, కొమ్మగళ్ళ మచ్చగిరి, మధు తదితరులు పాల్గొన్నారు.