Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండలఅధ్యక్షునిగా సత్యపాల్, యూత్ అధ్యక్షునిగా భాస్కర్
నవతెలంగాణ-నిడమనూరు
టీఆర్ఎస్ మండల నూతన కమిటీని హాలియా పట్టణంలో ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన ఆయన స్వగహంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.మండల అధ్యక్షుడిగా తాటి సత్యపాల్, ప్రధాన కార్యదర్శిగా నల్లబోతు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షునిగా గడ్డం సత్య నారా యణరెడ్డి, యూత్ అధ్యక్షుడిగా ఉన్నం భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా నారబోయిన శంకర్‌గౌడ్, అధికార ప్రతినిధిగా లకుమాల మధుబాబు, సంయిక్త కార్యదర్శిగా సింగం రామలింగయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా అలంపల్లి నరేష్, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా బాలునాయక్, రైతు సమితి అధ్యక్షునిగా బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షునిగా చింతపల్లి వెంకన్నగౌడ్లను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. యూత్ అధ్యక్షునిగా, బీసీ సెల్ అధ్యక్షునిగా నూతన అభ్యర్థులను ఎన్నుకున్నప్పటికీ పాత కమిటీ సభ్యులను యథాతథంగా కొనసాగించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, వైస్‌ఎంపీపీ బైరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ సలహాదారు బొల్లం రవిరామ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోలే డేవిడ్, కేశ శంకర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెడమం యాదయ్య, కేషబోయిన జానయ్య, పగిళ్ళ శివ పాల్గొన్నారు.