Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ నల్లమోతు సిద్ధార్ధ పేర్కొన్నారు.కరోనా బారినపడి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 26 మంది జర్నలిస్టులకు మూడు నెలల్లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.2.60 లక్షల ఆర్థికసాయం అందజేశారు. నల్లమోతు సిద్ధార్థ నిర్ధేశానుసారం కోవిడ్ బారినపడి కోలుకున్న జర్నలిస్టులను, కుటుంబసభ్యులను హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హామీద్ షేక్ పరామర్శించారు.అనంతరం సిద్ధార్థ పంపిన ఆర్థికసాయాన్ని అందజేశారు.తాజాగా కోవిడ్ బారినపడిన ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన చక్ర టీవీ జర్నలిస్ట్ భాస్కర్‌కు, కేఎస్ఎన్ ఛానెల్ జర్నలిస్ట్ సైదులుకు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున రూ.20వేలు మిర్యాలగూడ పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో అందజేశారు. అనంతరం హమీద్షేక్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఆర్థికసాయం అందజేస్తూ సిద్ధార్థ మనోధైర్యం కల్పించడం అనిర్వచనీయమని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో కోవిడ్ బారినపడి కోలుకున్నప్పటికీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 28 మంది జర్నలిస్టులకు ఆర్ధికసాయం అందించి యువనేత మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన సిద్ధార్థకు జర్నలిస్టులు భాస్కర్, సైదులు కతజ్ఞతలు తెలిపారు.