Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాకపోకలు బంద్
నవతెలంగాణ-నిడమనూరు
మండలకేంద్రానికి అతి సమీపంలో ఉన్న చిలకలవాగు ఆదివారం కూలిపోయింది.దీంతో పలు గ్రామాలనుండి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.బంకాపురం,వెనిగండ్ల, సూరేపల్లి గ్రామాల ప్రజలు మండలకేంద్రానికి రావాలంటే చిలుకలవాగుపై నిర్మించిన బ్రిడ్జిపై ప్రయాణం చేసి రావాల్సి ఉంది.అయితే బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం కావడంతో ఆదివారం బంకాపురం గ్రామానికి టెంట్ సామాను లోడ్ తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి రెండుగా చీలిపోవడంతో ట్రాక్టర్ ట్రాలీ అందులో కూరుకుపోయింది.దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే దూకినప్పటికీ ట్రాలీ మాత్రం అందులో పడిపోయి బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది.దీంతో మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. బంకాపురం వైపు నుండి మండలకేంద్రానికి రెండు కిలోమీటర్లే కానీ బ్రిడ్జికూలడంతో వేరే ప్రాంతం నుండి మండలకేంద్రానికి రావాలంటే కనీసం ఏడు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది.ప్రధానంగా నిడమనూరులో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇది పెద్ద పరీక్షగా మారింది.అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతులు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.