Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఋద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
నవతెలంగాణ-నాగార్జునసాగర్
కచ్ఛితమైన సమాచారం, చక్కటి వేషధారణ, ఆకర్షించే ఉచ్ఛారణ, ఆసక్తికరమైన కథనా నైపుణ్యాన్ని బుద్ధవనంలో శిక్షణ పొందిన టూర్ గైడ్లు అలవర్చుకోవాలని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.బుద్ధవనం టూర్ గైడ్ల 5వ రోజు శిక్షణ శిబిరం ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.యువతకు జీవనోపాధి కల్పించడమే కోసమే టూర్ గైడింగ్ శిక్షణ ఇచ్చామన్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న 17 మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.అనంతరం తెలంగాణ పర్యాటకాభివద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.మనోహర్ మాట్లాడుతూ టూర్ గైడ్లు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.అతిథులతో మర్యాదగా మెలగాలని, పర్యాటకుల సమయం, ఆసక్తి మేరకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శిక్షణా తరగతుల నిర్వాహకులు ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం ఓఎస్డీ సూదన్రెడ్డి, ఎస్ఈ క్రాంతిబాబు,బుద్ధవనం డిజైనర్ ఇన్చార్జి శ్యామ్సుందర్, ఏఈ జగదీష్ పాల్గొన్నారు.