Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
చౌటుప్పల్:రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి కోరారు. సోమవారం మున్సి పల్ కార్యాలయం, సినిమా థియేటర్లను ఆయన సందర్శించారు. సినిమా చూసిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ యుగాలు మారినా తరాలు మారినా దేశంలోని రైతుల కష్టాలు మాత్రం మారడం లేదన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రైతులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు సంబంధించిన బాధలు, పంటలు పండించి మార్కెట్లో విక్రయించే దశలో ఎన్ని కష్టనష్టాలు ఉంటున్నాయనేది తెలుపుతూ ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం నారాయణమూర్తిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలంగౌడ్, జీఎంపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహా, కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్‌బాబు, కొయ్యడ సైదులుగౌడ్, ఆలె నాగరాజు, నాయకులు గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, సందగల్ల సతీశ్‌గౌడ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కొండ శ్రీనివాస్‌గౌడ్, సందగల్ల మల్లేశ్, ఆవుల యేసు, కామిశెట్టి భాస్కర్, నందగిరి శ్యా మ్ పాల్గొన్నారు