Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి
టీడబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్
ఎదుట ధర్నా
నవతెలంగాణ- నల్లగొండ
రాష్ట్ర స్థాయి మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కన్వీనర్ యారెడ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణ, మండల కేంద్రాలలో పని చేస్తున్న ప్రతిఒక్క జర్నలిస్టుకూ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యూస్ కవరేజ్‌కి వెళ్తున్న జర్నలిస్టుల పై దాడులను అరికట్టేందుకు జిల్లా ,రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హెల్త్ కార్డులు ప్రైవేట్ ,కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మీడియా అకాడమీ బడ్జెట్‌ను పెంచి సమాచార శాఖకు పూర్తిస్థాయ కమిషనర్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మట్టయ్య, నిసార్, గాదె రమేశ్, పంచలింగం, ధర్మేంద్ర, జర్నలిస్టులు జాజాల కష్ణ,సదత్ ఆలీ, నరసింహ, నరేష్ ,రమేష్, కరింగ్ శ్రీనివాస్, వెంకన్న, సాగర్, సూర్యనారాయణ, శ్రీపతిరావు, శేఖర్ రెడ్డి, ఇబ్రహీం ,రమేష్, రాజేష్, పగడాల సురేశ్, గుండాల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.