Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీిఐ (ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి. జహంగీర్
నవతెలంగాణ-రామన్నపేట
గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలను ఏకం చేసి ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలోని అమృతవనంలో సీపీఐ(ఎం) మండల 7వ మహాసభ నాయకులు కూరెళ్ళ నరసింహచారి, జంపాల అండాలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వలు ఎండ్లు గడుస్తున్నా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వాస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, మూసీ, అసీఫ్ నహర్ కాల్వల శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య, కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి జల్లేల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, మండల కమిటీ సభ్యులు యాదాసు యాదయ్య, కందుల హనుమంతు, బల్గూరి అంజయ్య, బోయిని ఆనంద్, వనం ఉపెందర్, బావండ్లపల్లి బాలరాజు, కల్లూరి నగేష్, మామిడి వెంకట్ రెడ్డి, పులి భిక్షం,పండగ రాజమల్లు, పబ్బతి లింగయ్య, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి, సర్పంచ్ యాదాసు కవిత, జల్లల లక్ష్మమ్మ, బడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.