Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు పిలుపునిచ్చారు.సోమవారం కల్లుగీత కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని, పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని, సభ్యత్వం ఉన్న ప్రతి కల్లుగీత కార్మికులకు ఉచిత బైకులు అందించాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకుపోతామని తెలిపారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య, సంఘం అనుముల మండల అధ్యక్షులు కాట్నం యాదగిరి గౌడ్, సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు లక్ష్మీగౌడ్, నర్సింగ్ సైదులు గౌడ్, బొల్లేపల్లి రమేష్‌గౌడ్, రావుల వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు.