Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెర వేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీడబ్య్లూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయూనియన్ జిల్లా అధ్యక్షుడు అయితబోయిన రాంబాబుగౌడ్ మాట్లా డారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయన్నారు.అర్హులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు.అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు చెల్లుబాటయ్యే విధంగా చూడా లన్నారు.జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. కరోనాతో మృతి చెందిన వారికుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కార్యదర్శి పాల్వాయి జానయ్య, రాష్ట్ర నాయకులు నాయిని శ్రీనివాస్‌రావు, బుక్క రాంబాబు,నాయకులు లింగాల సాయి, పాలవరపు శ్రీనివాస్, గట్టు అశోక్, బూర వెంకటేశ్వర్లు, తండు నాగేందర్, ఫణినాయుడు, శ్రీనివాస్,శరత్, వెంకన్న, నందిపాటి సైదులు, బుక్క ఉపేందర్, అర్జున్, ప్రభాకర్, శ్రీనివాస్, సతీష్ పాల్గొన్నారు.