Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటి స్థానం రావడం అభినందనీయం
జడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలోని 3వ వార్డులో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిపిన ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్తు చైర్మెన్ ్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అభినం దనలు తెలిపారు. సోమవారం కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లింగోజిగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు మున్సిపాలిటీని అభివద్ధి చేయాలనే దఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోనే చౌటుప్పల్ పట్టణాన్ని మొదటి స్థానంలోకి తీసుకురావడానికి చైర్మెన్ రాజు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీచేశారు. మొదటి స్థానానికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె.నర్సింహారెడ్డి, కౌన్సిలర్ బండమీది మల్లేశం, మెడికల్ వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ రాకేశ్‌రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.