Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
పోడు సాగుదారులపై ప్రభుత్వం నిర్బంధం ఆపే యాలని, పోడు, డి. ఫారెస్ట్ భూములను సాగు చేసుకుం టున్న సాగు దారులకు హక్కు పత్రాలు, నూతన పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పోడు సాగు దారులపై ప్రభుత్వ నిర్బంధాన్ని నిలిపివేసి పోడు, డి.ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న సాగు దారులకు హక్కు పత్రాలు, నూతన పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతూ జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను నమ్ముకుని గిరిజనులు, పేదలు అనేక మంది జీవిస్తున్నారని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అటవీ సంపదను పరిరక్షిస్తూన్నారన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అడవుల నుండి గిరిజనులను పేదలను తరిమివేసి అడవి సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు గుత్తా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడు సాగుదార్లందరికి ఆరు నెలల్లో పట్టాలిస్తామన్న టీిఆర్ఎస్ అధినేత హామీ ఏమైందని ప్రశ్నించారు. పోడు రైతులు అనాదిగా అష్ట కష్టాలు పడి భూములను వ్యవసాయానికి అనుగుణంగా తయారుచేసుకుని పంటలు పండిస్తుంటే రైతులపైకి ఫారెస్టు అధికారులను ఎగదోయటం, సాయుధ ఫారెస్టు చెక్ పోస్టులు పెంచడం, దాడులు చేయడం, కేసుల పెట్టి వేధించడం, జైలుకు పంపడం ఎమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలకు పైగా పోడు వ్యవసాయం చేస్తూ రెండు లక్షల పైగా పోడు రైతులు అటవీ హక్కు పత్రాల కోసం వానికి దరఖాస్తు చేసుకోగా కేవలం లక్ష మందికి 5 లక్షల ఎకరాల భూమికి పట్టా ఇచ్చారన్నారు. మిగతా లక్షమందికి ఎనిమిది లక్షల ఎకరాల భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డి ఫారెస్ట్ భూములు సేద్యం చేసుకుంటున్న వారికి నూతన పాసు మేక్కులు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగా స్వామి.జెటవత్త్ రవినాయక్.లగిశెట్టిశ్రీను.నాయకులు మన్నె బిక్షం.చెరుకు పెద్దులు. గునుగుండ్ల రామకష్ణ రెమిడాల భిక్షం.బి బాలసైదులు శ్రీను జంజిరాల లెనిన్ తదితరులు పాల్గొన్నారు.