Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత్స్యకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకష్ణ
నవతెలంగాణ -రామన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మూసీ నది నీటి కాలుష్యం నుండి కాపాడి మత్స్యకారులకు వత్తి రక్షణ, ఉపాధి, భద్రత కల్పించాలని మత్స్యకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని చర్క జగన్నాథం స్మారక భవన్లో ఆ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సంఘం నాయకులు కర్రే సంతోష్ అధ్యక్షతన నిర్వహించారు. అక్టోబర్ 7న రామన్నపేటలో నిర్వహించే సంఘం జిల్లా సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామన్నపేటలో నిర్వహించనున్న మత్స్యకారుల జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరారు. హైదరాబాద్ నుండి వచ్చే డ్రైనేజీ, కంపెనీల రసాయన వ్యర్థపదార్థాలు రావడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు మొత్తం కాలుష్యమై మత్స్య సంపదకు నష్టం కలుగుతోందన్నారు. చేప పిల్లల పంపిణీలో 60 శాతం కమీషన్లు దళారులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేవలం 40 శాతం మాత్రమే మత్స్యకారులకు లబ్ది చేకూరుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో రూ.20 కోట్లతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రతి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షల ఆర్థిక సహకారాన్ని సొసైటీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్వోలకు, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఠా విజరు కుమార్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కర్రే సంతోష్, జోగుల శ్రీనివాస్ , జిల్లా నాయకులు కందుల హనుమంతు,పిట్టల శ్రీనివాస్, జోగుల చంద్ర మోహన్, అంబటి కష్ణ, జోగుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.