Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజ కవర్గానికి దళిత బంధు అమలుచేసి ఇంటికి పది లక్షలు ఇస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్‌చేశారు. తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా ఆయన బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ స్మారక భవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వరదల సమయంలో తనకు కరోనా రావడంతో చౌటుప్పల్‌కు రాలేకపోయానని తెలిపారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌లతో మాట్లాడి చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి వంద కోట్లు, చండూరు మున్సిపాలిటీకి 50 కోట్లు నిధులు విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం లేదన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వివక్ష వీడి అభివృద్ధి చేయాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉబ్బు వెంకటయ్య, ఆ పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులు బక్క శ్రీనాథ్, మొగుదాల రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.