Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్
సూర్యాపేటకలెక్టరేట్:మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 27న తలపెట్టిన దేశ వ్యాప్త భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గాంధీపార్క్‌లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో 10 నెలలుగా రైతులు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారని, చలి, ఎండలో రైతులు ఆందోళన చేయడం అభినందనీయమన్నారు. రైతు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు, ఉద్యమంలో చీలికలు తీసుకొచ్చేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఈ ఉద్యమంలో 650 మందికి పైగా రైతులు మృతి చెందారని, ఎంతో మంది గాయపడ్డారని అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొని కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలను నియంత్రించాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా పోడు భూములను సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొత్తపల్లి శివ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో అఖిలభారత రైతుకూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వర్రావు, అఖిల భారత రైతు కూలీ సంఘం (చంద్రన్న) రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి అచ్యుతరామారావు, ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కొప్పోజు సూర్యనారాయణ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు నాగార్జునరెడ్డి, అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.డేవిడ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మురగండ్ల లక్ష్మయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, తెలంగాణ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు మాండ్ర మల్లయ్యయాదవ్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, బహుజన రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకులు చెరుకు యాకలక్ష్మి, వల్లపుదాసు సాయికుమార్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు, భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఆరుట్ల శంకర్‌రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కిరణ్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.