Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరి
మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండ రోడ్డులో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డులో చెత్త వేయొద్దని కోరుతూ ఆ ప్రాంత రైతులు మంగళవారం మున్సిపాలిటీ వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమ పొలాల ప్రాంతంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేయడంతో గుంటల్లో నిలిచే వర్షపు నీరు కలుషితమై పశువులు, మేకలు ఆ నీళ్లు తాగి అస్వస్థతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొబ్బలి మహేష్, లింగయ్య, సోమయ్య, సత్తయ్య, రమేష్, మమత, రేణుక, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.