Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్ టౌన్
ఈ నెల 24న తలపెట్టిన స్కీమ్ వర్కర్ల సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి కోరారు. దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను మంగళవారం పట్టణంలో పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన స్కీమ్ వర్కర్లను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. స్కీం వర్కర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం ప్రతి నెలా రూ.21000 అందజేయాలని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మణి కుమారి, వెంకన్న, కోటమ్మ, సైదులు, శేఖర్, శ్రీదేవి, వాణి తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : ఈ నెల 24న నిర్వహించనున్న స్కీం వర్కర్ల సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారిని అనంతలక్ష్మికు సమ్మె నోటీసు అందజేసి మాట్లాడారు. వివిధ స్కీంలల్లో పనిచేస్తున్న వారికి పని భద్రత లేదన్నారు. స్కీం వర్కర్లకు దీర్ఘకాలికంంగా చెల్లించాల్సిన టీఏ, డీఏ, అంగన్వాడీ సెంటర్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన వర్కర్స్ అండ్ హెల్పర్స్‌కు రూ.50 లక్షలు చెల్లించాలని కోరారు